ముగిసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు

ముగిసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు

విశ్వంభర, మహబూబాబాద్: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్.టి.ఆర్  స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలకు 18 మండలాల నుంచి 121 మంది విద్యార్థులు హాజరై పోటీలలో పాల్గొన్నారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి డా.ఓలేటి జ్యోతి తెలిపారు. ఈ సంద ర్భంగా అధికారి మాట్లాడుతూ, తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో నాలుగవ తరగతి ప్రవేశం పొందేందుకు మూడవ తరగతి చదువుతున్న బాలబాలికలకు వివిధ అంశాల్లో 9 రకాల పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, వర్టికల్ జంప్, మెడిసిన్ బాల్ త్రో, షటిల్ రన్, 800 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించి, వారి ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయించామన్నారు. ఈ పోటీలలో జిల్లా స్థాయిలో ఎంపికైన  10 మంది బాలికలు, 10 మంది బాలురకు  ఏప్రిల్ 27 నుంచి హకీంపేట క్రీడా ప్రాంగణంలో జరిగే రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొంటారన్నారు.

Tags: