ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటా
On
- మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
విశ్వంభర, కోదాడ: కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాడిషా వెంకటేశ్వర్లు మాతృమూర్తి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేడు కాపుగల్లులోని వారి నివాసానికి వెళ్లి బాడిషా వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు దొంతగాని అప్పారావు గౌడ్, వార్డు మెంబర్లు గుండెబోయిన కొండ కాలతిరిపి రవి, సైదమ్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



