అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

విశ్వంభర, బషీర్ బాగ్ : అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతునే అణగారిన వర్గాల మధ్య అంబేద్కర్ చైతన్యం తీసుకొచ్చారని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ మెంబర్ సనా తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సనా మాట్లాడుతూ, సమాజంలో  సమాన అవకాశాలకు  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మార్గం దోహదపడుతుందన్నారు.  బడుగు, బలహీన వర్గాల పిల్లలు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరితేనే అంబేద్కర్ కన్న కలలు నిజమవుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ బాటలో పయనించి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Tags: