బండ కొత్తపల్లిలో ఐకెపి వడ్ల కొనుగోలు ప్రారంభం
On
విశ్వంభర, గుండాల : బండకొత్తపల్లి గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ గద్వాల ఉపేందర్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వమని, సకాలంలో వడ్లు కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే మిల్లర్లతో సమన్వయం చేసుకుని రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపాలదాస్ యాదగిరి, వార్డు సభ్యులు ఆంజనేయులు, శంకరయ్య, నర్సయ్య, ఉషా-ఉపేందర్, శాంతమ్మ, ఏపీఎం , మహిళా సంఘం అధ్యక్షురాళ్లు, రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



