కో ఆప్షన్ సభ్యులను నియమించాలి
On
- మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం
విశ్వంభర , తొర్రూర్: ఎన్నికల షెడ్యూల్ 2019 ప్రకారం మున్సిపాలిటీ లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి కౌన్సిలర్లు నాయకులు బుధవారం మున్సిపల్ కమిషనర్ వి శ్యాంసుందర్ కు వినతి పత్రం అందజేశారు. తొర్రూర్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక తక్షణమే నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి కౌన్సిలర్లు ఒకటో వార్డు భూసాని జయమ్మ, ఉప్పలయ్య మూడవ వార్డ్ తూర్పాటి రవి నాలుగో వార్డ్ పేర్ల జంపా, ఏడవ వార్డు మాడుగుల భవానీ లత, ఎనిమిదో వార్డ్ అల్లం శ్యామల, 9వ వార్డు కిన్నెర కవితా సతీష్, 11వ వార్డు కర్నే నాగరాజు, 12వ వార్డు పద్మ కిషన్ నాయక్ 15వ వార్డు చకిలేలఅలివేణి, నాగరాజు,బిఆర్ఎస్ నాయకులు చకిలేల మణిరాజ్, భూసానీ ఉప్పలయ్య లు సంయుక్తంగా వినతి పత్రం అందజేసి పరిపాలన విభాగంలో చట్టబద్ధంగా ఆప్షన్ సభ్యులను ఎన్నిక చేయాలని కోరారు.



