16న మండల స్థాయి సమావేశం
On
విశ్వంభర, రామన్నపేట: ఈ నెల 16న ఉదయం 10.30 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మండల స్థాయి సమావేశం నిర్విహించనున్నట్లు ఎంపీడిఓ ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్ లకు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులకు సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని, కావున హాజరు కావాలని ఆయన కోరారు.



