రూ.2.54 లక్షల ఢిల్లీ మద్యం పట్టివేత
విశ్వంభర, జిహెచ్ఎంసి: ఖరీదైన మద్యాన్ని ఢిల్లీలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి సికింద్రాబాద్‌లో మోండా మార్కెట్ శివాజినగర్ చెప్పాల్వాది బజార్ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతుండగా బుధవారం తెల్లవారు జామున సికింద్రాబాద్ ఎక్సైజ్ డీటీఎఫ్ టీమ్ సీఐ సౌజన్య టీమ్ పట్టుకున్నారు. ఢిల్లీకి వివిధ సామాగ్రి తీసుకు వెళ్లినపుడు తిరుగు ప్రయాణంలో శారద కుమార్(28) అనే వ్యక్తి ఢిల్లీలో శివాజీ రీగల్‌ను రూ.1500 లకు కొనుగోలు చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రూ.3000 వేల నుంచి రూ.3500 అమ్మకాలు జరుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు సికింద్రాబాద్ డీటీఎఫ్ సీఐ సౌజన్య, ఎస్సై శివకుమార్, కానిస్టేబుళ్లు జనార్థన్, రిజ్వాన్, సిద్దిక్‌లు పట్టుకున్నారు. వాహనంలో తనిఖీలు నిర్వహించగా 52 శివాజీ రీగల్ మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం బాటిళ్ల విలువ రూ.2.54 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. పట్టుకున్న మద్యం బాటిళ్లను, నిందితుడిని, వాహనాన్ని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు సీఐ సౌజన్య తెలిపారు.



