ఆపదలోవున్నవారికి సాయం చేయాలి
- మల్లన్న జాతరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
విశ్వంభర, సంగారెడ్డి: పట్టణం గొల్లగూడెంలో కొలువైన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీ ఐఐ సీ చైర్ పర్సన్ నిర్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భముగా ఆయన మాట్లాడుతూ, ఏ కులమైనా, ఏ దేవుడైనా.. ఆపదలో వున్నవారికి సాయం చేయాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు, మల్లన్న, బీరప్ప దేవుళ్ళ కథల్లోని సారాంశం కూడా ఇదే అని దీనిని అందరం పాటిద్దామని అన్నారు. కులాలు అనే తేడా లేకుండా అందరూ కలిసి మెలిసి జీవించాలన్నదే మల్లన్న, బీరప్ప కథల్లో వున్న సందేశమని జగ్గారెడ్డి వివరించారు . ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు చెప్పిన మల్లన్న, బీరప్ప ఒగ్గు కథలను ఆసక్తిగా జగ్గారెడ్డి విన్నారు. ఈ కల్యాణోత్సవంలో సంగారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ కూన వనితా సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.



