రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ఉస్మాన్ అలీ

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ఉస్మాన్ అలీ

విశ్వంభర, పరిగి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిగి మండల పరిధిలోని మిట్ట కోడూరు గ్రామంలో ప్రధానోపాధ్యాయులు ఎండి ఉస్మాన్ అలీ ఆధ్వర్యంలో  రోడ్డు భద్రత నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులచే రోడ్డు భద్రతపై పెయింటింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. రోడ్డు భద్రత అవగాహన పై చక్కని పెయింటింగ్ వేసిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉస్మాన్ అలీ మాట్లాడుతూ.. క్షేమంగా మన ప్రయాణం సాగాలంటే రోడ్డు భద్రత నియమ నిబంధనల గురించి తెలుసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ కారు నడిపేటప్పుడు సీడ్ బెల్ట్ తప్పక ధరించాలని సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాణిక్యం, పాఠశాల కమిటీ చైర్మన్ అనిత రాణి, ఉపసర్పంచ్ మల్లేశం, గ్రామ కార్యదర్శి బాలకిషన్, వార్డు సభ్యులు జనార్దన్, మల్లేశం, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags: