నెహ్రూ విగ్రహం పునర్నిర్మాణ పనులు
విశ్వంభర, చార్మినార్: చార్మినార్ నియోజకవర్గంలోని లాల్ దర్వాజా మోడ్ సర్కిల్లోని1964 నాటి పండిత్ జవహర్ లాల్ విగ్రహానికి బుధవారం పునర్నిర్మాణ పనులు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్యదర్శి శ్యామ్ రావు ముదిరాజ్ చొరవ తీసుకొని జిహెచ్ఎంసి ఈఈ సలావుద్దీన్ సంప్రదింపులతో ప్రారంభించారు. విగ్రహానికి కలరింగ్, ఐరన్ జాలి, డోర్, నిచ్చెన, అండర్ ఫ్లోరింగ్ వర్క్, ప్రహరీ గోడ నిర్మాణం చేశారు. ఈ సందర్బంగా సలావుద్దీన్ కి శ్యామ్ రావు ముదిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చార్మినార్ కాంగ్రెస్ ఇంచార్జ్ ముజీబుల్లా, బహదూర్పుర ఇంచార్జ్ పులిపాటి రాజేష్, కాంగ్రెస్ పీసీసీ సెక్రెటరీ వెంకటేష్ ముదిరాజ్, హైదరాబాద్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ శ్రీకాంత్ గౌడ్, బి బ్లాక్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముత్యం యాదవ్, రాజ్ నారాయణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.



