ప్రెస్ క్లబ్ భవన నిర్మాణమే ప్రధాన అజెండా

ప్రెస్ క్లబ్ భవన నిర్మాణమే ప్రధాన అజెండా

  • కార్యవర్గాన్ని ప్రకటించిన పేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వజ్జ వీరయ్యయాదవ్

విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు సరైన ప్రెస్ క్లబ్ భవనం లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రెస్ క్లబ్ భవన నిర్మాణమే ప్రధాన అజెండాగా సూర్యాపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ పని చేస్తుందని సూర్యాపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వజ్జ వీరయ్యయాదవ్ అన్నారు. బుధవారం స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఆయా జర్నలిస్టు సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సూర్యాపేట ప్రెస్ క్లబ్ పూర్తి స్థాయి నూతన కమిటీని ఎంపిక చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం నూతన కమిటీ వేసుకునేందుకు ముందుకు వచ్చిన జర్నలిస్టులందరికి అభినందనలు తెలిపారు. సూర్యాపేట ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయింపు జరిగినప్పటికి భవన నిర్మాణం చేసుకోలేకపోవడం బాధకరమన్నారు. తద్వారా జర్నలిస్టులకు సరైన గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రస్తుతం ఏర్పడిన ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అందరిని కలుపుకొని ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి పాటుపడుతుందన్నారు. ప్రతి జర్నలిస్టు నూతన కార్యవర్గానికి సహకరించి జర్నలిస్టులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారంతో పాటు నూతన ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన కార్యవర్గ గౌరవాధ్యక్షులుగా చలసాని శ్రీనివాసరావు, నాయిని శ్రీనివాస రావు, అధ్యక్షులుగా వజ్జె వీరయ్య, ప్రధాన కార్యదర్శిగా ఐతగాని రాంబాబు, కోశధికారిగా తల్లాడ చందన్, గౌరవ సలహాదారులుగా మిక్కిలినేని శ్రీనివాసరావు, షేక్ జహంగీర్, గుండా శ్రీనివాస్ గుప్తా, తోట నర్సయ్య, వర్ధిల్లి అరుణ క్రిష్ణ, బంటు క్రిష్ణ, చల్లా చంద్రశేకర్, రాపర్తి మహేష్, ప్రచార కార్యదర్శిగా ఉటూకూరి రవిందర్, ఉపాధ్యక్షులుగా సుంకరబోయిన వెంకటయ్య, పెద్దింటి శ్యాంసుందర్రెడ్డి, చౌగాని నరేందర్, మడూరి బ్రహ్మచారి, దేవరగట్ల సతీష్, పులుసు నాగరాజు, గుడిపూడి రామక్రిష్ణ, ఉయ్యాల నర్సయ్య, ఖలీల్, మామిడి శ్రావణ్, బొడ్డు నాగరాజు, వేల్సుల ప్రవీణ్, సహాయ కార్యదర్శులుగా కందుకూరి యాదగిరి, అమరగాని నాగేందర్, మాదగాని వేణు, కందుల నాగరాజు, ఎరుకల సైదులు, బుక్క ఉపేందర్, పెనుగొండ మల్లికార్జున్, మామిడి శంకర్, పడిసిరి వెంకట్, దుర్గం బాలు, సంయుక్త కార్యదర్శులుగా బచ్చు పురుషోత్తం, షేక్ రషీద్, మాదవ్, కొండ్లి క్రిష్ణయ్య, పుట్ట రాంబాబు, బచ్చలకూరి వెంకన్న, కార్యవర్గ సభ్యులుగా లింగాల సాయి, కంచర్ల సురేందర్, జంపాల ఉపేందర్, దుస్య చంద్రశేఖర్, గిరిష్ కుమార్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు బొజ్జ ఎడ్వర్డ్, గునగంటి సురేష్, బుక్క రాంబాబు, ఉట్కూరి రవిందర్, జర్నలిస్టు సంఘాల నాయకులు మిక్కిలినేని శ్రీనివాసరావు, నాయిని శ్రీనివాసరావు, కందుకూరి యాదగిరి తోపాటు పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు.

Tags: