యూత్ అధ్యక్షులుగా గడెల ప్రశాంత్
On
విశ్వంభర, కందుకూరు : కందుకూరు మండల కేంద్రంలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు అందె బాలరాజు ఆధ్వర్యంలో నూతన యూత్ అధ్యక్షులను ఎన్నుకున్నారు. యూత్ అధ్యక్షులుగా గడెల ప్రశాంత్ నాయిని ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ప్రశాంత్ నాయి మాట్లాడుతూ, నాపై నమ్మకంతో యూత్ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షులు ఘనపురం యాదయ్య, గడెల కృష్ణ, గనపురం ప్రవీణ్, శ్రీగాది విష్ణు, శ్రీగాది రమేష్, శ్రీ గాది కుమార్, పాడిపల యాదగిరి, గణపురం నరసింహ, వెంకటేష్ నాయి తదితరులు పాల్గొన్నారు.



