బస్టాండ్ లో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు
On
విశ్వంభర, కోదాడ: కోదాడ బస్టాండ్ ఆవరణంలో అగ్ని మాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అగ్నిమాపక అధికారి కే బాబు ప్రారంభించారు. ప్రతిఒక్కరు అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రయాణికులకు బస్సు డ్రైవర్లకు సిబ్బందికి అగ్ని ప్రమాదాలను ఏ విధంగా ఎదుర్కోవాలో వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్, ఫైర్ సిబ్బంది లీడింగ్ ఫైర్ ఫైటర్ ఎం శ్రీనివాసరావు, ఆర్ నాగయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



