కమ్యూనిజంతోనే సమ సమాజం సాధ్యం
విశ్వంభర, హిమాయత్‌నగర్ : ఆర్థిక, సామాజిక అసమానతలను నిర్మూలించాలంటే కమ్యూనిజం సిద్ధాంతాలే మార్గమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కలపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహ తెలిపారు. సమాన హక్కులు, సమాన అవకాశాలు అందరికీ లభించాలంటే పాలనా విధానాల్లో మార్పు అవసరమన్నారు. హిమాయత్‌నగర్ లోని రాజ్ బహదూర్ గౌర్ హాల్‌లో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర రెండో మహాసభల లోగోను ఆవిష్కరించారు. దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉందని, సామాజిక చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. భూమి, విద్య, ఉపాధి రంగాల్లో సమానత్వం లేకుండా స్వేచ్ఛ సాధ్యం కాదని, రాజ్యాంగ హక్కులు పూర్తిగా అమలుకావడం లేదన్నారు. ప్రజాస్వామ్య పోరాటాలతో పాటు వర్గపోరాటం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో ఏసురత్నం, మారుపాక అనిల్ కుమార్, ఆరుట్ల రాజ్ కుమార్, జేరిపోతుల కుమార్, వై ఉషా శ్రీ, టి కొమురెల్లి బాబు పాల్గొన్నారు.



