ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పై సమావేశం
On
విశ్వంభర, నెల్లికుదురు: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పై మండల కేంద్రం నెల్లికుదురు అమూల్య గార్డెన్లో గురువారం అన్ని గ్రామాల సర్పంచులు,పంచాయితీ కార్యదర్శులు ఆయా శాఖల అధికారులకు మండల స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం9: 30 నిమిషాలకు ప్రారంభమయ్యే సమావేశానికి సకాలంలో హాజరు కావాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై సమావేశం కొనసాగుతుందని పేర్కొన్నారు.సభ లో వివిధ ముఖ్య పథకాలు అమలు పురోగతి,సాధించిన విజయాలు,రైతు భరోసా,ఇతర పథకాల లబ్ధిదారుల సంఖ్య, ప్రజాప్రతినిధుల సందేశాలు, గుర్తించిన సమస్యలు,తీర్మానాలు తదితర అంశాలపై మీటింగ్ జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు



