గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమాలు
- ఆయిల్ పామ్, ఉద్యాన పంటల సాగు లాభదాయకం
- పంట మార్పిడితో అధిక ఆదాయం
- ఆయిల్ పామ్ సాగు పై అవగాహన, క్షేత్ర సందర్శన
విశ్వంభర, మహబూబాబాద్: రైతులను వరి, పత్తి, మొక్కజొన్న, మిరప వంటి పంటల నుండి పంట మార్పిడి చేయించి లాభాలను ఇచ్చే ఆయిల్ పామ్, పండ్లు, కూరగాయలు, మునగ, పూలు, మల్బరీ, తేనెటీగలు పెంపకం, పుట్టగొడుగుల పెంపకం మొదలైన మార్కెట్ డిమాండ్ గల వాటిని సాగు చేయాలని ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో కురవి గ్రామంలో ఆయిల్ పామ్ పై అవగాహన క్షేత్ర సందర్శనను మేక వెంకట్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మెన్, మహబూబాబాద్ నల్ల సుధాకర్ రెడ్డి, మాట్లాడుతూ వరి, ప్రత్తి, మిరప, మొక్క జొన్న పంటలకు బదులుగా రైతులు పంట మార్పిడి ద్వారా లాభదాయకమైన పంటలను సాగు చేయాలని తెలిపారు. మార్కెట్ డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్, అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మునగ, ఉల్లి, వెల్లుల్లి, పూలు, మల్బరీ మొదలైన పంటలు సాగు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మెన్, మహబూబాబాద్ నల్ల సుధాకర్ రెడ్డి , అభ్యుదయ రైతులతో పంట మార్పిడి ద్వారా ఆయిల్ పామ్, మల్బరీ సాగు పై కర పత్రాలు, డైరీలు ఆవిస్కరించారు. రైతులను ఉద్దేశించి జిల్లా ఉద్యాన ,పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న తో పాటు పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ రాయితీలు, కూరగాయల పందిళ్ళు, మల్చింగ్, కోల్డ్ రూమ్స్, నిల్వ గిడ్డంగులు, షేడ్ నెట్ హౌస్లు, ఆయిల్ పామ్ రాయితీ, మార్కెటింగ్ వసతులు, మల్బరీ రాయితీలు పొందాలని తెలిపినారు. రైతులు నీటి & భూసార పరీక్షలు చేయించుకోవాలి, ప్రకృతి సేద్యం అవలంభించాలని తెలిపారు. బోర్లు-బావుల క్రింద వరి, పత్తి, మిరప, మొక్కజొన్న వంటి పంటలకి బదులుగా, మార్కెట్ డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్, అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మునగ, ఉల్లి, వెల్లుల్లి, పూలు, మల్బరీ మొదలైన పంటలు సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన పరిశోదన స్టానం శాస్త్రవేత్తలు ప్రశాంత్, ఎల్.సుహాసిని, వ్యవసాయ అధికారి నరసింహా రావు, ఉద్యాన అధికారులు ఆర్. శాంతి ప్రియ, ఎ. జే. శాంతి ప్రియదర్శిని, వ్యవసాయ విస్తరణ అధికారి రాజేశ్వరి, ఉద్యాన విస్తరణ అధికారి టి. విజయపాల్ రెడ్డి, రమేష్ & ఆయిల్ ఫెడ్ విస్తరణ అధికారి కె. రంజిత్, ఆయిల్ ఫెడ్ మానిటరింగ్ అధికారి కె. రంజిత్, బిందు సేద్య ఇంజనీర్ కిషోర్, బిందు సేద్య ప్రతినిధి బి. అశోక్, జి. ప్రసాద్ బాబు, బి. అశోక్, ఆగస్టిన్, అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు.



