వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 

వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 

విశ్వంభర, నిజామాబాద్ : ఇందల్వాయి మండలం లోని లోలం ఎల్లారెడ్డిపల్లి జీకే తండా, స్టేషన్ తండా లో ఏపీఎం సునీత  ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.ఈ సందర్బంగా సునీత మాట్లాడుతూ, రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధాన్యంలో తేమశాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలన్నారు. తూకం వేసి ఆన్‌లైన్ లో అప్‌లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు. ఎ గ్రేడ్ మద్దతు ధర 2389 రూపాయలు, సాధారణ రకం 2369 రూపాయలు, సన్నరకం ధాన్యంకు అదనంగా బోనస్ 500 రూపాయలు  ఇస్తారని అన్నారు.   ఈ కార్యక్రమంలో సిసి స్వప్న, లోలం సర్పంచ్ గౌడ్, ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ సుజాత శేఖర్, జీకే తండా సర్పంచ్ ఆశ మహిపాల్,  స్టేషన్ తండ భారతి జగత్ పవర్ నల్లవెల్లి సర్పంచ్ కర్నే  రాజేందర్ ఏఎంసి  డైరెక్టర్ రాజు వివిధ గ్రామ సంఘాల సిఏలు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు గ్రామ సమాఖ్య పాలకమండలి సభ్యులు రైతులు పాల్గొన్నారు.

Tags: