కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వసంత పంచమి ఉత్సవాలు

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వసంత పంచమి ఉత్సవాలు

విశ్వంభర/ లింగోజిగూడ:-కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లింగోజిగూడ బ్రాంచ్ లో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శౌతి మురళీ శర్మ, బాసర పండితుల ఆధ్వర్యంలో గణపతి మరియు సరస్వతి పూజ కార్యక్రమాలతో ప్రారంభమై శ్రీమాన్ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ అనుగ్రహ భాషణం, మరియు వారి సహస్రాలతో అక్షరాభ్యాసం చేసి తల్లిదండ్రులకు వచ్చిన వారందరికీ మంగళ శాసనాలు ఆశీర్వచనాలు చేశారు. ఈ వేడుకలలో అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు వివిధ కాలనీలకు చెందిన అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొని జీయర్ స్వామి ఆశీస్సులు అందుకొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీ ఆలపాటి కామేశ్వరరావు కరస్పాండెంట్ శ్రీమతి శైలజ మరియు శ్రీనాథ్, పాఠశాల అభ్యున్నతి గురించి ప్రిన్సిపల్ రామారావు వివరించారు. అడ్మిన్ ప్రిన్సిపాల్ శ్రీ నవీన్ కుమార్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో చాలామంది నూతనంగా 2026 విద్యార్థులు చేరినట్టు అడ్మిన్ కాంతి లత తెలిపారు.

Tags: