అనాథ లకు అండగా కలెక్టర్

అనాథ లకు అండగా కలెక్టర్

 విశ్వాంభర, నిర్మల్: తల్లిదండ్రులు చనిపోయినా ఆర్ఫన్ సర్టిఫికెట్ ఇవ్వలేదని, పెదనాన్న తమ భూమి లాక్కున్నాడని లోకేశ్వరం
మండలం నగర్ కు  చెందిన అనాథలు గౌతమి, పూజ సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై చలించిన కలెక్టర్ వెంటనే స్థానిక ఎమ్మార్వోకు ఫోన్ చేశారు. దిక్కులేని పిల్లలను కోర్టుల చుట్టూ తిప్పొద్దని మందలించారు. వారికి వెంటనే సర్టిఫికెట్ ఇచ్చి, అండగా
నిలబడి న్యాయం చేయాలని ఆదేశించారు.

Tags: