ధరలు తగ్గించాలి: సిపిఐ

ధరలు తగ్గించాలి: సిపిఐ

విశ్వంభర, హనుమకొండ : పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సిపిఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్రం నియంత్రణలో విఫలమైందని విమర్శించారు. ధరలు తగ్గించకపోతే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

🕒 11 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cpi-should-reduce-prices/article-16514

Tags: