పేద పిల్లల భవిష్యత్తుకు నష్టం కలిగించొద్దు. -బొల్ల శివశంకర్
గ్రామీణ వాస్తవ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
విశ్వంభర, హైదరాబాద్ :- గ్రామీణ విద్యను బలోపేతం చేయాలనే మీ ఆలోచనను మేము అభినందిస్తున్నాం. మండల కేంద్రాల్లో అన్ని వసతులతో కూడిన మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలనే సంకల్పం గొప్పదే. అయితే, గ్రామీణ వాస్తవ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వినమ్రంగా కోరుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సామాజిక సేవా కార్యకర్త, ఆసరా ఫౌండేషన్ చైర్మన్ బొల్ల శివశంకర్ అన్నారు. .అనేక గ్రామాలు మండల కేంద్రాలకు 10 నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. కానీ ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు చదివే చిన్నారులకు ప్రతిరోజూ అంత దూరం ప్రయాణించడం చాలా కష్టసాధ్యం. ముఖ్యంగా ఆడపిల్లలు, పేద కుటుంబాల పిల్లలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల డ్రాప్‌అవుట్స్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా, ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం అనేక ప్రైవేట్ పాఠశాలలు నియంత్రణ లేకుండా అధిక ఫీజులు, పుస్తకాల ఖర్చులు, ఇతర రకాల ఛార్జీల పేరుతో తల్లిదండ్రులపై భారీ ఆర్థిక భారం మోపుతున్నాయి.కాబట్టి, వెంటనే ఒక విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నిర్మాణాన్ని సమీక్షించాలని కోరుతున్నాం. పాఠశాలల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, వసూలు చేస్తున్న ఫీజులపై సమగ్ర పరిశీలన చేసి, పారదర్శకమైన ఫీజు విధానాన్ని అమలు చేయాలి.అలాగే, గ్రామాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలను (1వ తరగతి నుండి 5వ తరగతి వరకు) కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. చిన్నారులకు వారి గ్రామాల్లోనే ప్రాథమిక విద్య అందుబాటులో ఉండాలి. 6వ తరగతి నుంచి పై తరగతుల కోసం మండల కేంద్రాల్లో అత్యాధునిక వసతులతో కూడిన మోడల్ పాఠశాలలను అభివృద్ధి చేయడం మంచి నిర్ణయమే. ఆ దిశగా మీ ప్రయత్నాలను మేము స్వాగతిస్తున్నాం.విద్యా సంస్కరణలు అవసరమే… కానీ గ్రామీణ పేద పిల్లల భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడడం అంతకంటే అవసరం.మీరు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు.