విశ్వంభర’ కథనానికి స్పందన.. బండ్లగూడలో తీరిన డ్రైనేజీ సమస్య !
- రంగంలోకి దిగి స్వయంగా పర్యవేక్షించిన శానిటేషన్ సూపర్‌వైజర్ అజర్
- సక్షన్ ట్యాంకర్‌తో పూడికతీత.. ఊపిరి పీల్చుకున్న ఠాకూర్ కాలనీవాసులు

విశ్వంభర, మేడ్చల్: కీసర సర్కిల్ దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని బండ్లగూడ ఠాకూర్ కాలనీలో గత కొంతకాలంగా స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న డ్రైనేజీ లీకేజీ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. కాలనీలో డ్రైనేజీ నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతూ, నరకప్రాయంగా మారిన పరిస్థితులపై ఇటీవల విశ్వంభర దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. కథనం పట్ల సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, దమ్మాయిగూడ మున్సిపల్ శానిటేషన్ సూపర్‌వైజర్ అజహర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బుధవారం ఆయన స్వయంగా సిబ్బందితో కలిసి ఠాకూర్ కాలనీని సందర్శించి క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలించారు. అనంతరం అత్యాధునిక శానిటైజేషన్/వ్యాక్యూమ్ క్లీనింగ్ వాహనాన్ని (సక్షన్ ట్యాంకర్) రంగంలోకి దించి, డ్రైనేజీ లైన్లలో పేరుకుపోయిన పూడికను, వ్యర్థాలను పూర్తిగా తొలగింపజేశారు.
స్థానికుల హర్షం – అధికారులకు కృతజ్ఞతలు
చాలా రోజులుగా దుర్వాసనతో, దోమల బెడదతో నరకం చూస్తున్న తమ సమస్యను పత్రికా ముఖంగా వెలుగులోకి తెచ్చినందుకు, దానికి వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించిన శానిటేషన్ సూపర్‌వైజర్ అజర్, మున్సిపల్ సిబ్బందికి ఠాకూర్ కాలనీ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకనైనా ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.