ఫౌండేషనల్ లెర్నింగ్ పరీక్షకు శిక్షణ
On
విశ్వంభర, గుండాల : దేశవ్యాప్తంగా మూడోతరగతి విద్యార్థులలో అభ్యా సన సామర్ధ్యాలను పరీక్షించేందుకు ఫిబ్రవరి 26న ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ పరీక్షను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్వహిస్తున్నందున విద్యార్థులను పరీక్షకు సన్నద్ధం చేయాలని గుండాల మండల విద్యాధికారి మన్నె అగ్గి రాములు ఉపాధ్యాయులను కోరారు. ఈ సమావేశంలో ఆర్పీలు జంపాల రాజు, మత్స్యగిరి సి ఆర్ పి దేవనబోయిన లింగయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



