నారాయణ ఈ-టెక్నో లో సైన్స్ ఫెయిర్
విశ్వంభర, నారాయణగూడ : విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఎంతో అవసరమనే ఉద్దేశంతో నారాయణగూడలోని నారాయణ ఈ-టెక్నో పాఠశాలలో సోమవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ శాస్త్రీయ ప్రయోగాలు, నమూనాలు, ప్రాజెక్టులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. ముఖ్య అతిథులుగా జి ఎం గోపాల్ రెడ్డి, ఏ జి ఎం బాల పరమేశ్వర్, హెచ్ ఆర్ విలసిత మాట్లాడుతూ శాస్త్రవేత్తలు ఎక్కడో దూరంలో లేరని, మన చుట్టుపక్కలే ఉన్నారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని, పరిశోధనా ఆసక్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ ఎన్ డి మనోహర్ రెడ్డి, ఈ చాంప్స్ ఆర్ ఎన్ డి మహేశ్వరి, కోఆర్డినేటర్ ఆజాద్, ఈ చాంప్స్ కోఆర్డినేటర్ రాధిక, ప్రిన్సిపాల్ విశాఖ, ఏవో మహమ్మద్ జుబేర్, ఈ చాంప్స్ వైస్ ప్రిన్సిపాల్ మోహి ఉన్నిసా, ఈ కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.



