యాదవులను చిన్నచూపు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
విశ్వంభర, బషీర్ బాగ్: సీఎం రేవంత్ రెడ్డికి యాదవులు కనిపిస్తాలేరనీ, రాష్ట్ర ప్రభుత్వం యాదవులను చిన్నచూపు చూస్తుందనీ యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ ఆరోపించారు. యాదవులకు మంత్రి పదవి ఇవ్వకుంటే సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపుతామాన్ని హెచ్చరించారు.ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో యాదవ మేధావుల సదస్సు జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అజయ్ కుమార్ యాదవ్ హాజరై మాట్లాడుతూ 10 వేల కోట్లతో యాదవుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నామినేటెడ్ పదవులలో యాదవులకు సముచిత స్థానం కల్పించాలన్నారు.యాదవులకు గతంలో ఉన్న ఎస్ఎన్టి రిజర్వేషన్ ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కోకాపేట్ లో ఏర్పాటు చేస్తున్న యాదవ ఆత్మగౌరవ భవనాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు.గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతిని బహిరంగ పర్చాలన్నారు.సీఎం రేవంత్ రెడ్డికి రెండున్నర ఏళ్ల నుంచి యాదవులు కనిపించడం లేదన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీపీ మండల్ సిఫారసులను అమలు చేయాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మరో మండల్ ఉద్యమం చేస్తామన్నారు. యాదవ జేఏసీ యాదవుల ఐక్యతే లక్ష్యంగా పని చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో యాదవ జేఏసీ వైస్ చైర్మన్ చిలుకల శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు బెల్లి చంద్రశేఖర్ యాదవ్, గంగుల మధు యాదవ్, మేకల శివశంకర్ యాదవ్, లీగల్ సెల్ కన్వీనర్ పొన్నం రవీందర్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజి యాదవ్, డాక్టర్ శ్రీనివాస్ యాదవ్, నక్క ఉమేష్ యాదవ్, నక్క మహేష్ యాదవ్, విజయ్ కుమార్ యాదవ్,అంబర్ పేట్ శ్రీనివాస్ యాదవ్, ప్రొఫెసర్ రాము, న్యాయవాదులు అరుణ్ కుమార్ యాదవ్, నాగుల శ్రీనివాస్ యాదవ్, నాగుల వేణు యాదవ్, యాదవ జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.



