పేరుకే మిషన్ భగీరథ.. చుక్క నీరు రావట్లే..

పేరుకే మిషన్ భగీరథ.. చుక్క నీరు రావట్లే..

  • నీళ్లు రాక 3 నెలలుగా ఖాళీగా 5ట్యాంకులు  
  • పట్టించుకోని అధికారులు: సర్పంచ్ నర్సింహ  

 విశ్వంభర,నెల్లికుదురు: మండలంలోని కాస్య తండా తో పాటు జిపి పరిధి తండాలలో మిషన్ భగీరథకు చెందిన 5ట్యాంకులు ఉండగా3 నెలలుగా చుక్కనీరు కూడా రావకపోవడంతో తండావాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆ గ్రామ సర్పంచి బోడ నర్సింహ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచిగా విధుల్లో చేరినప్పటి నుంచి సంబంధిత ఏఈలకు పలుమార్లు సమస్య తీవ్రతను దృష్టికి తీసుకువచ్చినా రేపు,మాపు అంటూ మూడు నెలలు గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు నీటి కోసం అల్లాడుతున్నారని మిషన్ భగీరథకు చెందిన 5ట్యాంకులు ఖాళీగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ నరసింహ ఆదివారం సిబ్బందితో కలిసి వాటర్ ట్యాంకులను ఎక్కి నీటి జాడ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సమస్యపై మండలాధికారులు సైతం చూస్తాం..చేస్తాం.. అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వేసవిలో నీటి ఎద్దడి రానీయమని ప్రజా ప్రతినిధులు,అధికారులు అవాకులు చవాకులు చెబుతున్నారని ఆచరణలో శూన్యమనడానికి కాస్య తండా పెద్ద ఉదాహరణ అన్నారు. ప్రజల కోసం,ప్రజల ధనంతో నియమించబడిన అధికారులు పనిచేయడం లేదని వారు ఉంటేనేం, లేకుంటేనేం అంటూ వారి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమ తండా ప్రజల నీటి ఇబ్బందిని తీర్చాలని కోరారు.

Tags: