సెమినార్ ను జయప్రదం చేయాలి

సెమినార్ ను జయప్రదం చేయాలి

 విశ్వంభర,సూర్యాపేట: తెలంగాణ సాయుధ పోరాట యోగురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారి నాలుగో వర్ధంతి సందర్భంగా ఈనెల 18వ తేదీన విజయ్ కన్వెన్షన్ 0హాల్లో జరుగు ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం-భారత్ పై ప్రభావం అనే అంశంపై జరుగు సెమినార్ జయప్రద చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్ లో సెమినార్ కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని సాధించడం కోసం అమెరికా కొన్ని దేశాలపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతుందని అన్నారు. గతంలో ఉక్కిరేయిన్, పాలస్తీనా మీద ప్రస్తుతం ఇరాన్ మీద యుద్ధం చేసి తన పెత్తనం కోసం అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటుందని అన్నారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్  యుద్ధం చేస్తుండడంతో భారత్ పై ధరల ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో భారత ప్రధాని యుద్ధం నివారించడం కోసం మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ఇరాన్ పై సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధకాండను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన విజయ్ కన్వెన్షన్ హాల్లో జరుగు ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం భారత్ పై ప్రభావం అనే అంశంపై జరుగు సెమినార్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సెమినార్ కు ముఖ్య అతిథులుగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి.అబ్బాస్,జూలకంటి రంగారెడ్డి,మల్లు లక్ష్మి గార్లు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సెమినార్ లో పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట గోపి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న ధనియాకుల శ్రీకాంత్ జిల్లా నాయకులు చినపంగి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: