మున్సిపల్ కమిషనర్ విస్తృత పర్యటన

మున్సిపల్ కమిషనర్ విస్తృత పర్యటన

విశ్వంభర, ఖమ్మం : 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 23వ డివిజన్‌లో మున్సిపల్ కమిషనర్ పర్యటన ఖమ్మం: నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక  అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు  మున్సిపల్ కమిషనర్ ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.ముందుగా కమిషనర్  23వ డివిజన్‌లో పర్యటించి, అక్కడ జరుగుతున్న పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. రోడ్ల శుభ్రత, డ్రైనేజీల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం డివిజన్‌లోని పార్కును సందర్శించి, అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులన్నీ నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.అనంతరం మామిళ్లగూడెం ప్రాంతంలో కొనసాగుతున్న ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను కమిషనర్ గారు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తూ.. పన్ను వసూళ్లను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పన్ను చెల్లింపులు సులభతరం చేసేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో  అదనపు పన్ను వసూలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.నగర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, సకాలంలో పన్నులు చెల్లించి కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ గారు ఈ సందర్భంగా కోరారు.

Tags: