గ్యాస్ కొరత నివారించాలి 

గ్యాస్ కొరత నివారించాలి 

విశ్వంభర. నాగారం: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ గ్యాస్ సిలిండర్లను రోడ్డుపై ఉంచి మహిళలతో నిరసన తెలిపింది.ఈ సందర్భంగా ఆ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షులు,మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలపై అధిక భారాలు మోపుతున్నాయన్నారు. గ్యాస్ కొరత నివారించడంతోపాటు పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు జటంగి రవి,నాయకులు మల్యాల రాములు,మాజీఎంపీటీసీ ఇలైజర్,మాజీ సర్పంచ్ జటంగి మల్లమ్మ మల్లయ్య,శ్రావణ్,సామెల్,విజయ్,వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Tags: