పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం ప్రారంభం

పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం ప్రారంభం

విశ్వంభర, దోమ:  మండల పరిధిలోని గోట్ల చేలుక తండా గ్రామంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రైమరీ పాఠశాల ప్రహరీ గోడ  నిర్మాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దశలవారీగా గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవితా చందర్, మాజీ మండల పిఎసిఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతిరెడ్డి, ఉప సర్పంచ్ బిక్కీ, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, నాయకులు రవి, రూపుల, సేవియా, మాంగ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: