ఫీజు రీయింబర్స్ మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర 

ఫీజు రీయింబర్స్ మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర 

  •  ఎంపీ ఆర్ కృష్ణయ్య

విశ్వంభర, బషీర్ బాగ్: రాష్ట్రంలో ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న పథకాన్ని కాపాడుకుంటామని అన్నారు. సోమవారం  బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ళ సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు 6 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని , ఇప్పుడు అవి 8 వేల కోట్లకు చేరాయన్నారు. కనీసం గత రెండేళ్లుగా ఉన్న బకాయిలు అయిన చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీలు ఉన్నత చదువులు చదవడం ఇష్టం లేదేమో అని విమర్శించారు. బకాయిల విడుదల కోసం శాంతియుతంగా నిరసనలు తెలపాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ నెల 6న కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి కలెక్టర్ , ఆర్డీవో , ఎమ్మార్వో కార్యాలయాల ముందు నిరసనలు తెలపాలని ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ సమావేశంలో బీసీ నేతలు నీల వెంకటేష్, అనంతయ్య, రాందేవ్ మోడీ, రాజేందర్, అంజి గౌడ్, నిఖిల్ పటేల్, ప్రీతమ్, రఘు పతి, లవకుమార్, రాజేష్  తదితరులు పాల్గొన్నారు. కాజీపేట దర్గాలో గల గాంధీ నగర్ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్న స్మశాన వాటిక. అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మానస రాంప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: