ఇఫ్తార్ విందు
On
విశ్వంభర, సదాశివపేట: సదాశివపేట పరిధిలోని మజీద్ అన్వర్ సాహ నయాబ్ కాలనీలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ శ్రీనివాస్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాజిద్ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు అతి పవిత్రమైనదని, అంతేగాక హిందూ ముస్లింలు బాహి బాహీగా కలిసి ఉండాలని ఉద్దేశంతోనే ఈ ఇఫ్తార్ విందులు ఒకరికొకరు ఇచ్చుకోవడం జరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరి పైన అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నవాబ్, అంజిరెడ్డి, నాగరాజ్, మంగలి రాజు తదితరులు పాల్గొన్నారు.



