2.44 కేజీల గంజాయి పట్టివేత
On
విశ్వంభర, హైదరాబాద్: మలక్పేట్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ లో గంజాయి పాకెట్లు అమ్మకాలు జరుగుతున్న సమాచారం మేరకు ఎస్టిఎఫ్ ఏ టీం అంజిరెడ్డి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో 359 గంజాయి పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.ఒక్కొక్క గంజాయి పగటి ఆరు నుంచి ఏడు గ్రాములు గా ఉంది.మొత్తం గంజాయి పాకెట్లను తూకం వేయగా 2. 44 కేజీల గంజాయిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో సయ్యద్ మన్నన్ (31) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.ఈ కేసులో మా అక్రూర్ ఖాన్ పై కూడా కేసు నమోదు చేసినట్టు అంజిరెడ్డి తెలిపారు.నిందితుడిని గంజాయిని మలక్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.



