మున్సిపల్ ఎన్నికల బరిలో 'జాగృతి' లేదు

మున్సిపల్ ఎన్నికల బరిలో 'జాగృతి' లేదు

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. జాగృతి సంస్థ ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందలేదని, అందుకే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల బరిలో తాము పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ** జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పాత్రపై స్పందిస్తూ.. "ఎవరు మద్దతు కోరినా ఇచ్చేందుకు మేము సిద్ధం. అడిగిన చోట నేను, ఇతర జాగృతి నేతలు కలిసి ప్రచారంలో పాల్గొంటాం" అని కవిత తెలిపారు. అభ్యర్థుల గుణగణాలను బట్టి మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని ఆమె సంకేతాలిచ్చారు.

ట్యాపింగ్ కేసుపై సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవిత నిరాశ వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుదిదశకు చేరుతుందన్న నమ్మకం తనకు లేదని కవిత తెలిపారు. బాధితురాలిగా తనకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదని చెప్పారు. మాజీ మంత్రి హరీశ్‌రావుకు 'సిట్' నోటీసులు ఇవ్వడం కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమేనని ఆమె విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

Read More నకిరేకల్ ఎమ్మెల్యే తో రాపోలు భేటీ.  చేనేత సమస్యలపై చర్చ. 

ట్యాంక్ బండ్‌పై ఉద్యమకారుల విగ్రహాలు
తెలంగాణ అస్థిత్వంపై మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్ పైన తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాల్సిన అవసరం ఉందని కవిత పునరుద్ఘాటించారు. ముఖ్యంగా ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను గౌరవించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.