గౌలీ పుర  గంగపుత్ర సంఘం ఎన్నికలు

గౌలీ పుర  గంగపుత్ర సంఘం ఎన్నికలు

విశ్వంభర,గౌలిపుర: గౌలిపుర సుల్తాన్ షాహీ గాంధీపుర  గంగపుత్ర సంఘo లో రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ ఎన్నికలను ఎర్మని బిక్షపతి, కృష్ణమూర్తి ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనిర్వహించగా  ఈ సారి ఓటర్ శాతం పెరగడం జరిగింది అని అన్నారు. రెండు సంవత్సరాల  ముందు జరిగిన ఎన్నికలలలో 530 ఓట్లు పోలుకాగా ఈ సంవత్సరం583 ఓట్లు పోలయ్యాయి. రెండు ఓట్లు చెల్ల నివి కాగా,ఈ ఎలక్షన్స్ లో 1) కోయిలకొండ రాజేంద్రప్రసాద్ 2)బండారి రాజు 3) కల్చటి నర్సింగరావులపోటాపోటి లో కల్చటి నర్సింగ్ రావ్ 218ఓట్లు పోలు కాగా బండారి రాజుకు 1 ఓటు  కోయిల కొండ రాజేంద్ర ప్రసాద్ ప్రత్యర్థి కల్చటి నర్సింగ్ రావు, బండారి రాజు పై 144ఓట్ల భారీ మెజార్టీ తో గెలుపొందారు. కోయిలకొండ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని సంఘ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, గెలుపోటములు సహజమే అందరితో కలిసి నడుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పల్లెల లక్ష్మణ్ గరిగే నర్సింగ్ రావు, ముట్ట శ్రీనివాస్, రూప్ రాజ్, ఎర్మని శ్రీనివాస్,, గరిగే అజయ్, గరిగే కుమార్, గరిగే మహేశ్వర్,సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేశారు. మొగుల్పురా పోలీస్ వారి సహాయ సహకారాలతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని సంఘ సభ్యులు సంతోషం వ్యక్తం చేసారు.

Tags: