రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి 

రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి 

  • ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం 

 విశ్వంభర,సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట పట్టణం కొత్త బస్టాండ్ ప్రాంగణంలో సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నడిగూడెం  ట్రాఫిక్ నియమాల పట్ల వాహన డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ 99 రోజుల కార్యచరణ కార్యక్రమాలలో పోలీస్ శాఖ తరపున వాహనదారులకు, డ్రైవర్లకు, ప్రజలకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్న పరిస్థితులను ప్రమాదాలను అడ్డంకులను గమనించాలని సూచించారు ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు హెల్మెట్ ధరించాలని అన్నారు తప్పుడు మార్గంలో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలియజేశారు.. ప్రజలు రోడ్డు నియమ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందాలని ప్రతి ఒక్కరు సురక్షిత గమ్యం చేరుకోవాలని కోరారు.

Tags: