ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యం: ఎస్ఐ చిరంజీవి 

ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యం: ఎస్ఐ చిరంజీవి 

విశ్వంభర. నాగారం: ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యం అని నాగారం ఎస్ ఐ చిరంజీవి అన్నారు. ఆదివారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి ఈటూరు క్రాస్ రోడ్  365 బి పై వద్ద వాహన దారుల భద్రత కొరకు అవుట్ డోర్ లెడ్ ఫ్లాట్ లైట్లను ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన దారులు ప్రయాణ సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని సూచించారు. గ్రామాల్లో యువత చెడు వేసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణకు ప్రజాప్రతినిధులు సహకరించారు కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను ఎవరు ప్రోత్సహించ  వద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈటూరు సర్పంచ్ వంగూరి దామోదర్ ఫణిగిరి సర్పంచ్ సావిత్రి యాదగిరి గంగి అవిలయ్య బాలరెడ్డి,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: