మోడల్ స్కూల్ విద్యార్థులకు ఆట వస్తువులు అందజేత 

మోడల్ స్కూల్ విద్యార్థులకు ఆట వస్తువులు అందజేత 

విశ్వంభర, కేసముద్రం: కేంద్ర ప్రభుత్వం మేర యువ భారత్ వరంగల్ కేంద్రం వారి ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభ్యన్ కార్యక్రమం నిర్వహించి ఈ రోజు ముగింపు కార్యక్రమం  కేసముద్రం మండలం కల్వల   మోడల్ పాఠశాల, జూనియర్ కళాశాల ఆట వస్తువులు పంపిణీ చేయడం, జరిగింది. ప్రోగ్రాం కోఆర్డినేటర్  ధరావత్ రాజేందర్   తెలిపారు.ఈ కార్యక్రమానికి,ముఖ్య అతిథిలుగా విచ్చేసినటువంటి కల్వల  గ్రామ సర్పంచ్ వేల్పూ సుజాత మరియు వార్డ్ మెంబర్స్ గండి శ్రీనివాస్ ,  ఫిజికల్ డైరెక్టర్ లలిత, హాజరు కావడం జరిగింది.ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ యువ మండల్ వికాస్ అభ్యాన్ ద్వారా యూత్ మరియు యువజన సంఘాలు అభివృద్ధికి ఎంతో గాను పాటుపడతాయని అలాగే వివిధ గ్రామాలలో ఉన్నటువంటి యువత, యువజన, సంఘాలుగా ఏర్పడి వారి వారి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ వారు కూడా ఆర్థికంగా ,రాజకీయంగా అభివృద్ధి చెందాలని అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ను కూడా మిరు అందిపుచ్చుకోవాలని అన్నారు.అనంతరం వివిధ విద్యార్థులకు, యువజన సంఘాలకు కేటాయించినటువంటి *మైభారత్ స్పోర్ట్స్ కిట్స్ ను పంపిణీ చేయడం జరిగింది

Tags: