ఘనంగా శ్రీపాదరావు జయంతి

ఘనంగా శ్రీపాదరావు జయంతి

విశ్వంభర, హనుమకొండ: గ్రామీణ అభివృద్ధి, రైతుల సంక్షేమం, బలహీన వర్గాల పురోగతికి కృషి చేసిన దుద్దిళ్ల శ్రీపాద రావు సేవలు  చిరస్మరణీయమని ఎన్పీడీసియల్  సీఎండీ  కర్నాటి వరుణ్ రెడ్డి  కొనియాడారు. హన్మకొండ,  నక్కలగుట్టలోని సోమవారం  ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్  కార్పొరేట్  కార్యాలయంలో  నిర్వహించిన దుద్దిళ్ల శ్రీపాద రావు  91వ జయంతి వేడుకలకు సీఎండీ   కర్నాటి వరుణ్ రెడ్డి విచ్చేసి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు . అనంతరం డైరెక్టర్లు మోహన్ రావు , టి.మధుసూదన్ , సి. ప్రభాకర్ పూలతో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా  సీఎండీ  కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ,  ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన  ప్రజా నాయకుడు దుద్దిళ్ల  అన్నారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా , శ్రీపాదరావు  ప్రజాసేవనే తన జీవిత లక్ష్యంగా ఎంచుకుని, ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేశారన్నారు.  ఆయన రాజకీయ జీవితం నిబద్ధత, పారదర్శకత, ప్రజల పట్ల అపారమైన ప్రేమకు ప్రతీక అన్నారు . ప్రజల మధ్యే ఉంటూ, వారి అవసరాలు తెలుసుకుని, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ఆయన ప్రత్యేకత కనిపించేదని పేర్కొన్నారు .  ఈ కార్యక్రమంలో  డైరెక్టర్లు  వి . మోహన్ రావు , టి.మధుసూదన్ , సి. ప్రభాకర్ , సీవీవో  బోనాల కిషన్ , సి.ఈ లు  , కె.రాజు చౌహాన్ , అశోక్ , అన్నపూర్ణ , సురేందర్ , మాధవ రావు , సీజియం  రవీంద్రనాధ్ , జాయింట్ సెక్రటరీ కె. రమేష్ , శ్రీ కృష్ణ ,  కంపెనీ సెక్రటరీ కె . వెంకటేశం , జియంలు హేమంత్ కుమార్ ,  వేణు బాబు , గిరిధర్, నాగ ప్రసాద్ , కళాధర్  రెడ్డి , జయ రాజ్ ,  శ్రీనివాస రావు  తదితరులు పాల్గొన్నారు .

Tags: