ఓటు విలువను తెలియజేసిన గొప్ప వ్యక్తి కాన్సీరాం

ఓటు విలువను తెలియజేసిన గొప్ప వ్యక్తి కాన్సీరాం

  •  మోత్కుపల్లి నర్సింహులు

విశ్వంభర, బాగ్ లింగంపల్లి : బహుజన సమాజానికి ఓటు విలువను తెలియజేసి రాజ్యాధికారానికి దారి చూపిన గొప్ప నాయకుడు కాన్సిరాం అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంధు సోసైటీ అధ్యక్షుడు పల్లెల వీరస్వామి అధ్యక్షతన కాన్సిరాం 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్సిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ బహుజనులకు కల్పించిన ఓటు హక్కును సరైన విధంగా వినియోగించకపోవడం వల్లే బహుజనులు రాజ్యాధికారానికి దూరమవుతున్నారని పేర్కొన్నారు. పేదవాడైనా, ధనవంతుడైనా ఒకే ఓటు, ఒకే విలువ అనే సూత్రాన్ని భారత రాజ్యాంగం పేర్కొన్నప్పటికీ దాని ప్రాముఖ్యతను బహుజనులు పూర్తిగా అర్థం చేసుకోకపోవడం విచారకరం అన్నారు.కాన్సిరాం ఇచ్చిన స్ఫూర్తితో బహుజన సమాజం ఐక్యంగా నిలిచి రాజ్యాధికారాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్టిఎస్ అధికారి డాక్టర్ అప్పికట్ల భరత్భూషణ్, ప్రొఫెసర్ ముత్తయ్య, మంద కనకయ్య, వశపాక నర్సింహా, దండి కృష్ణ, నర్సింగరావు, సత్యనారాయణ, కోలా జనార్ధన్, దున్న యాదగిరి, సి. రవిందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: