జల్సాల కోసం ఆటో చోరీ.. నిందితుడి అరెస్ట్​

జల్సాల కోసం ఆటో చోరీ.. నిందితుడి అరెస్ట్​

విశ్వంభర, నిజామాబాద్:   నిజామాబాద్​  నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ శ్రీనివాస్. మాట్లాడుతూ. జల్సాల కోసం ఓ యువకుడు చోరీలకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేసి  కటకటాల వెనక్కి పంపారు.  నార్త్​ రూరల్​ సీఐ శ్రీనివాస్​ ఆదివారం వివరాలు వెల్లడించారు.  నాందేడ్​లో విక్రయానికి తీసుకెళ్తుండగా..వలపన్ని పట్టుకుని..నాందేడ్​లో విక్రయానికి తీసుకెళ్తుండగా.. నగరంలోని న్యాల్​కల్​ రోడ్​ నివాసి  అయిన జిన్నా నర్సింలు ఈనెల 12న తన ఆటో చోరీకి  గురైందని ఐదో టౌన్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీ పుటేజీలను పరిశీలించారు. అనంతరం నెహ్రూనగర్​కు చెందిన నిందితుడు షేక్​ నయీంను అదుపులోకి తీసుకున్నాడు. తాగుడు, జల్సాలకు అలవాటు పడ్డ నిందితుడు డబ్బుల కోసం ఆటో చోరీ చేసి విక్రయిద్దామని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ఆర్​ఆర్​ చౌరస్తా వద్ద పార్క్​ చేసిన ఆటోను చోరీ చేసి నాందేడ్​లో విక్రయించేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో పోలీసులు వలపన్ని అతడిని  అర్సపల్లి బైపాస్​ వద్ద ఆటోతో సహా పట్టుకున్నారు. నిందితుడు నేరం అంగీకరించాడని.. అతడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపర్చి అనంతరం రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో చురుకుగా వ్యవహరించిన ఎస్సై గంగాధర్​, ఐదో టౌన్​ సిబ్బందిని సీఐ శ్రీనివాస్​ అభినందించారు.

Tags: