అభివృద్ధి కమిటీ సమావేశం

అభివృద్ధి కమిటీ సమావేశం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించి, రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల అభివృద్ధి, వైద్య సిబ్బంది సమస్యలు, ఔషధాల లభ్యత వంటి అంశాలపై చర్చించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, రామన్నపేట మండల పరిధిలోని ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైన వైద్య సేవలు అందేలా కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే వీరేశం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్-చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర మండల నాయకులు పాల్గొన్నారు.

Tags: