పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి
విశ్వంభర,సూర్యాపేట: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 18వ వార్డులో శుభ్రత కార్యక్రమం. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజలు కూడా పారిశుధ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి” అని 18వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు.ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని 18వ వార్డులో నిర్వహించిన శుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులను స్వయంగా పర్యవేక్షించారు. పారిశుధ్య కార్మికులతో కలిసి రహదారులను శుభ్రం చేయించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి పరిశుభ్రమైన వాతావరణం ఎంతో అవసరమన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సక్రమంగా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. అలాగే ఇంటి వద్దే తడి, పొడి చెత్తను వేర్వేరుగా వర్గీకరించి ఇవ్వడం ద్వారా వ్యర్థాల నిర్వహణ సులభమవుతుందని చెప్పారు.ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డులో పరిశుభ్రత కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాలోత్ కమల చంద్రు నాయక్ మున్సిపల్ వార్డు అధికారి నాగార్జున , స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



