మ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

మ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

విశ్వంభర, అంబర్‌పేట : అంబర్‌పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మెహమూద్ అలీ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ మాసం సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవించడం హైదరాబాదు సంస్కృతి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపవాసం ముగించిన ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ముస్లిం మత పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Tags: