స్కావెంజర్ల సంఘం మండల కమిటీ ఎన్నిక
విశ్వంభర,నెల్లికుదురు:స్కావెంజర్ల సంఘం మండల కమిటీని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఇసంపెల్లి సైదులు, జిల్లా అధ్యక్షులు నెమ్మది వెంకటేశ్వర్లు సమక్షంలో స్థానిక గెస్ట్ హౌస్ లో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగాయాకూబ్ పాష,ఉపాధ్యక్షులుగా హెచ్.వెంకన్న,మండల ప్రధాన కార్యదర్శి అవ్వారి శ్రీనివాస్,కార్యదర్శి గూడెల్లి ఉమ,కోశాధికారి ఇసంపెల్లి ఐలమ్మ,కార్యవర్గ సభ్యులుగా కొమురయ్య,డొనుక వెంకటమ్మ,చెడుపాక ఉప్పలమ్మ,జిలకర సుగుణమ్మ,ఎండి గౌస్య,పబ్బు వెంకటమ్మ,ఇసంపల్లి ముత్తయ్య,మంద సుజాత. కే రాధిక లను ఎంపిక చేశారు. అంతకుముందు రాష్ట్ర నేత సైదులు మాట్లాడుతూ..రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో స్కావెంజర్లుగా 28,700 మంది పనిచేస్తున్నారని వీరికి పాఠశాలలోనే విద్యార్థుల సంఖ్యను బట్టి వేతనం చెల్లించడం సరికాదన్నారు.సమాన పనికి సమాన కనీస వేతనం చెల్లించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



