మహబూబాబాద్ పట్టణంలో గంజాయి పట్టివేత
- ఇద్దరు యువకులు అరెస్ట్
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణ పరిధి మంగళి కాలనీ, పత్తిపాక ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో గంజాయి తాగుతున్న తాళ్ల అభిషేక్, S/o కుమార్, 26 సం, వృత్తి: మెకానిక్, నివాసం: మంగలి కాలనీ, మహబూబాబాద్ మరియు నాయిని ఈశ్వర్, S/o శ్రీనివాస్, 21 సం, వృత్తి: స్టూడెంట్, నివాసం: పత్తిపాక, మహబూబాబాద్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.50,000/- విలువచేసే మొత్తం 12 గ్రాముల గంజాయిని, మరియు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరియు మత్తు పదార్థాల వినియోగం మరియు రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువత మత్తుకు బానిసై జీవితాలు పాడు చేసుకోవద్దని, ప్రజలు ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి, సూచించారు.



