అంగరంగ వైభవంగా ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు

విశ్వంభర, నిజామాబాద్: ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఉదయం యాగశాలలో మహా పూర్ణాహుతి అనంతరం భక్తులను ఉద్ధేశించి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ జియర్ స్వామి వారు ప్రవచనాలు చేశారు. భగవంతునిపై ప్రేమతో సేవలు చేస్తున్న ఇందూరు తిరుమల ఇలలో వైకుంఠంగా మారడం ఖాయమని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామి వారు అన్నారు. మనుషులు సదా భగవంతునికి కృతజ్ఞాతపూర్వకంగా ఉండాలని అన్నారు. భగవంతుడు లోక కార్యం మనుషుల ద్వారా చేస్తారు అని అన్నారు. భగవంతుడి కృప వల్లనే మనిషి గొప్పగా ఎదుగుతాడు అని అన్నారు. భగవంతుడు లోక కార్యానికి మనుషులను ఎంచుకుంటాడు అని అన్నారు. భగవంతుడు మనల్ని ఎంచుకునేందుకు అర్హత సాధించాలి అని అన్నారు... మనిషి లోపల భూత దయ ప్రకృతి పట్ల ప్రేమ దేశ భక్తి ఉండాలి అన్నారు. భగవంతుడు అన్ని కార్యాలను మనుషుల ద్వారానే చేస్తారు కాబట్టి ఆ మనిషి మనమే ఎందుకు కావద్దు అనే తపన ఉండాలి అని అన్నారు. కలి యుగంలో హరి నామమే మోక్ష మార్గం కాబట్టి ప్రతి క్షణం హరి నామం జపిస్తూ ఉండాలి అని అన్నారు. మనిషి తాను మోక్ష మార్గాన్ని అనుసరిస్తు సాటి మనిషికి కూడా మోక్ష మార్గాన్ని చూపెట్టాలి అని అన్నారు. ఇందూరు తిరుమల ఇలలో మరో వైకుంఠంగా వెల్గొనన్నుది అని అన్నారు.బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు మహా పూర్ణాహుతి అనంతరం ఉదయం స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు ఆలయ మాడవీధుల్లో భక్తులు వ్రతాన్ని లాగగా వేలాదిమంది కదలిరాగా గోవింద నామస్మరణతో మాడవీధులు పులకించిపోయాయి. దిల్ రాజు సోదరులు శిరీష్ రెడ్డి నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి స్వయంగా స్వామివారి రథాన్ని లాగుతు ముందుకు నడిచారు. నర్సింగపల్లి గ్రామ మహిమలు హారతులు పట్టుకొని స్వామివారికి స్వాగతం పలుకుతూ దారి వెంట నృత్యాలు చేసుకుంటూ నడిచారు. రథోత్సవం అనంతరం స్వామి వారికి చక్ర స్నానం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు... ఆలయ పుష్కరిణిలో స్వామివారికి చక్ర స్నాన కార్యక్రమాన్ని దేవనాథ జియర్ స్వామి వారు, యజ్ఞాచార్యులు, వేద పండితులు మరియు అర్చక స్వాములు నిర్వహించారు. అన్ని కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామ ప్రజలు మరియు నిజామాబాద్ నగర ప్రజలు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన ధర్మకర్త నర్సింహ్మా రెడ్డి దంపతులు, ప్రముఖ సినీ నిర్మాత సోదరులు దిల్ రాజు దంపతులు మరియు శిరీష్ రెడ్డి దంపతులు, విజయసింహా రెడ్డి దంపతులు, సుధర్షన్ రెడ్డి దంపతులు ఎంపీటీసీ రాములు, ఫోటో గంగాధర్, ప్రవీణ్, పృథ్వి నారాయణ, నర్సారెడ్డి, నరాల సుధాకర్, రమేష్ భాస్కర్, నరేందర్, రాజేశ్వర్, సాయిలు, గంగారెడ్డి, ప్రమోద్, భూం రెడ్డి, యాజ్ఞాచార్యులు అనంత ఆచార్యులు, రోహిత్ కుమారాచార్యా విజయ్ స్వామి, అనిల్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags: