కంఠమహేశ్వరునికి యశస్విని రెడ్డి పూజలు

కంఠమహేశ్వరునికి యశస్విని రెడ్డి పూజలు

విశ్వంభర,నెల్లికుదురు: మండలంలోని వావిలాల గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి కి గౌడ కులస్తులు ఆదివారం నిర్వహించిన తృతీయ వార్షిక బోనాల వేడుకలలో తొర్రూరు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.గ్రామాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ పాడిపంటలతో చల్లగా చూడాలని వేడుకున్నారు.ఎమ్మెల్యే వ్యక్తిగత పిఏ, వావిలాల గ్రామస్తుడు మద్దెల రాజేష్ గౌడ్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యేతో పాటు టీపీసీసీ వైస్ చైర్మన్ హాజరై గౌడ కులస్తులు గ్రామస్తుల తో కలిసి సందడి చేశారు. అంతకు మునుపు గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ తోపాటు గౌడ కులస్తులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: