రామన్నపేట నియోజకవర్గం సాధించుకుందాం.. కదలి రండి..
విశ్వంభర, రామన్నపేట:ఉమ్మడి నల్గొండ జిల్లాలో నియోజకవర్గం గా ఉన్న రామన్నపేట నియోజకవర్గాన్ని మళ్ళీ తిరిగి సాదించుకుందామని రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి కన్వీనర్ రెబ్బసు రాములు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రామన్నపేట నియోజకవర్గంగా 1952 నుండి 2008 వరకు కొనసాగిందని, 2009 డీలిమిటేషన్లో నకిరేకల్ నియోజకవర్గంలో కలపడం జరిగిందని, పునర్విభజనలో భాగంగా రామన్నపేట నియోజక వర్గంగా ఏర్పడే అవకాశం ఉందని, కావున మనందరం కలిసి మన మండలం తరపున అన్ని గ్రామాల నుండి తరలి పోరాడి నియోజకవర్గాన్ని సాధించుకుందామని, నియోజకవర్గ సాధన పార్టీలకు సంబంధించినది, వ్యక్తులకు సంబంధించినది కాదని, మన మండల అభివృద్ధి కోసం ముందుకు వెళదామని, ప్రతి ఒక్కరం పాల్గొందాం=మన రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించుకుందామని, అన్ని రకాల ఆఫీసులు, సౌకర్యాలు కలిగిన మండలం మనదని, అందరూ ఆహ్వానితులే కదలి రండని, రామన్నపేటను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని, రామన్నపేట హాస్పిటల్ ను 100 పడకలగా మార్చి అన్ని రకాల డాక్టర్లను అందుబాటులో ఉంచాలని రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి తరపున కోరుతున్నమన్నారు.



