ప్రజల మన్నన పొందేవిధంగా మా పాలన ఉంటుంది.-మునిసిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి నర్సరీ, డంప్ యార్డ్ మరియు పార్కులను సందర్శించిన మున్సిపల్ చైర్మన్
విశ్వంభర, చండూర్ : చండూరు మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్ ఇటీవల పూర్తయినది. రోడ్డుకి ఇరువైపుల షాప్ ల వెంట మెట్లను మరియు ర్యాంపులను నిర్మించుకోకుండా మట్టిని పోసు కొన్నారు. ఇట్టి మట్టిని తొలగించి మెట్లను, రాంపులను ఒక ఫీట్ లోపు వచ్చే విధంగా కట్టుకోవాలని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ మరియు కౌన్సిలర్ లు ప్రతి షాప్ తిరిగి షాపు యజమానులకు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ చండూరు మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుతూ, సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ప్రజల వద్దకే వెళ్లి, పరిసరాలను ఎవరికివారు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తున్నామన్నారు. షాప్ ల వద్ద అందరూ డస్ట్ బిన్నులను ఏర్పాటు చేసుకోవాలని, చెత్తను డస్ట్ బిన్నులలో మాత్రమే వేసి మున్సిపాలిటీ ట్రాక్టర్ వచ్చినప్పుడు వేయవలెనని కోరారు. ప్రతి షాప్ ముందు యజమానులు ఎవరికి వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా నంది హోమ్స్ లోని నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. వర్షాకాలంలో మున్సిపాలిటీ ప్రజలకు మొక్కల్ని ఇచ్చి, పెంచే విధంగా కృషి చేస్తామన్నారు. డంప్ యార్డును మరియు అంబేద్కర్ పార్క్,నేతాజీ పార్కులను సందర్శించి, మునుగోడు రోడ్ లో ఉన్న నేతాజీ పార్క్ ను మున్సిపాలిటీ ప్రజలు వాకింగ్ చేయడానికి ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బూతరాజు దశరథ,కోడి సుష్మా వెంకన్న, బుషిపాక వాసు, కటకం రమేష్, కల్లెట్ల మారయ్య, ఐతరాజు మల్లేష్, బోడ వెంకటేశం, సరికొండ వెంకన్న, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు.



